- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Shocking Incident: విశాఖలో పెను ప్రమాదం.. బయటపడిన కేంద్రమంత్రులు

దిశ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మ(Union Ministers Kumaraswamy, Bhupathiraju Srinivasa Varma)కు షాకింగ్ ఘటన ఎదురైంది. ఏపీ పర్యటన(AP Tour)కు వచ్చిన కేంద్రమంత్రులకు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) కార్మిక, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు వచ్చిన వారిని దారిలో ఉహించని ప్రమాదం పలకరించింది. విశాఖ షీలానగర్(Visakha Sheela Nagar)లో మంత్రులు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో మూడు వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఎనిమిది వాహనాల కాన్వాయ్‌లో మూడు కార్లు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నాయి. మాజీ ఎంపీ జీవీఏల్ కారు ధ్వంసమైంది. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది జీవీఎల్ కారు(GVL Car)ను పక్కకు తీశారు. అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రమంత్రులు వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసుల సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.
కాగా ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రప్రభుత్వం రూ. 11,440 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే ప్లాంట్ ప్రైవేటీకరణపై జరిగిన ప్రచారంతో కార్మికులు, ఉద్యోగులల్లో ఇంకా గందరగోళం నెలకొని ఉంది. దీంతో ప్లాంట్‌ను సందర్శించి కార్మికులు, ఉద్యోగ సంఘాల్లో ఉన్న అపోహలను తొలగించే బాధ్యతలను కేంద్రమంత్రి కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేంద్రం అప్పగించింది. ఇందులో భాగంగా ప్లాంట్ కార్మికులతో చర్చించేందుకు ఇద్దరు మంత్రులు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు తాజాగా వచ్చారు.
ఈ క్రమంలో విశాఖ ఎయిర్ పోర్టు(Visakha Airport)కు వచ్చిన మంత్రులను కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్టీల్ ప్లాంట్‌కు బయల్దేరిన నేపథ్యంలో అనుకోని ఘటన ఎదురైంది. ఒక్కసారిగా కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. రోడ్డుపై స్పీడుగా వెళ్తున్న క్రమంలో ఓ కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసే ప్రయత్నం చేశారు. అయితే వెనుకున్న కారు అదుపు తప్పింది. ముందున్న కారును ఢీకొట్టింది. ఇలా ఒకదానినొకటి బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా కొంత అలజడి రేగింది. అయితే ప్రమాదం నుంచి కేంద్రమంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో బీజేపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు.