Breaking: విశాఖకు రైల్వే జోన్.. కేంద్రం కీలక ప్రకటన

by srinivas |
Breaking: విశాఖకు రైల్వే జోన్.. కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖకు రైల్వే జోన్ కావాలనేది చిరకాల స్వప్నం. రాష్ట్ర విభజన హామీల్లోనూ ఈ డిమాండ్‌ను పొందుపర్చారు. కానీ 10 ఏళ్లుగా తాత్సారం జరుగుతోంది. ఇవాళ కేంద్రప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టించింది. ఈ సందర్భంగా ఏపీకి రైల్వే జోన్‌పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం భూమి ఇవ్వలేదని తెలిపారు. ‘విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఏకరాల స్థలం ఇవ్వాలని కోరాం. ప్రభుత్వం ఆ స్థలాన్ని ఇంకా కేటాయించలేదు. భూమి ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభిసాం. జోన్ ఏర్పాటుకు డీపీఆర్ రెడీ అయింది.’ అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.


ఇక ప్రస్తుత బడ్జెట్‌లో ఏపీకి రూ. 9,138 కోట్లు కేటాయించినట్లు అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. 2009 నుంచి 2014 వరకు రూ.886 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఏడాదికి 240 కి.మీ మేర ట్రాక్ పనులు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో 98 శాతం విద్యుద్దీకరణ పనులు పూర్తి అయ్యాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed