- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయవాడ సెంట్రల్‌లో వైసీపీకి ఊహించని షాక్.. పార్టీకి కీలక నేత గుడ్ బై!
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో అధికార వైసీపీకి అసమ్మతుల గోల మొదలైంది. నియోజకవర్గాల ఇంచార్జీల మార్పు అధినేతకు కొత్త తలనొప్పులను తెచ్చి పెడుతోంది. ఈ క్రమంలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పంచాయతీ తాడేపల్లికి చేరింది. ఇప్పటి వరకు విజయవాడ సెంట్రల్ ఇంచార్జీగా ఉన్న మల్లాది విష్ణును ఇటీవలే సీఎం జగన్ ఇటీవలే తప్పించారు. ఆయన స్థానంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను ఇంచార్జీగా నియమించారు. ఈ క్రమంలో మల్లాది విష్ణు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. చివరికి ఆయన పార్టీని వీడేందుకు, అనుచర గణంతో సన్నద్ధమతున్నారని సమాచారం. అయితే, పార్టీకి నష్టం చేకూర్చకూడదని ప్రాంతీయ సమన్వయ కర్త అయోధ్యరామిరెడ్డి మల్లాది విష్ణు వద్దుకు వెళ్లి బుజ్జగిస్తున్నారని టాక్. అనంతరం ఆయనను సీఎం జగన్ వద్దకు నేతలు తీసుకువచ్చారు. వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులతో కలిసి సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఇద్దరు సమన్వయంతో ఎన్నికల్లో పనిచేయాలని సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. అందుకు మల్లాది విష్ణు ఒప్పుకుంటారో.. పార్టీ మారుతారో ఇక తెలియాల్సి ఉంది.