లడ్డూ ప్రసాద విక్రయ వార్తలపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ

by M.Rajitha |
లడ్డూ ప్రసాద విక్రయ వార్తలపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో లడ్డూ ప్రసాద విక్రయాలపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది టీటీడీ. పలు ఛానెల్స్ పనిగట్టుకొని టీటీడీ మీద దుష్ప్రచారం చేస్తున్నాయని... అలాంటి పుకార్లను, అసత్య ప్రచారాలను నమ్మవద్దని భక్తులకు సూచించింది. లడ్డూ ప్రసాదం కొంతమంది బ్లాక్ లో అమ్ముకుంటున్నట్టు తమ దృష్టికి రావడంతోనే ఆధార్ నమోదు విధానం పెట్టామని వివరణ ఇచ్చారు. దర్శనం టికెట్లు, టోకెన్స్ ఉన్నవారికి ఒక ఉచిత లడ్డూతో పాటు నాలుగు నుండి ఆరు లడ్డూలు విక్రయిస్తున్నామని... ఇక ఎలాంటి టికెట్స్, టోకెన్స్ లేని వారి ఆధార్ నమోదు చేసుకొని ఒక్కొక్కరికి రెండు లడ్డూలు విక్రయిస్తున్నామని తెలిపారు. టికెట్స్, టోకెన్స్ లేని విభాగంలో కొంతమంది చేతివాటం ప్రదర్శించి, లడ్డూలను బ్లాక్ లో అధిక ధరకు అమ్ముకుంటున్నారని.. అందుకే ఆధార్ నమోదు అనే చిన్న మార్పు మాత్రమే చేశామని క్లారిటీ ఇచ్చారు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి.

Advertisement

Next Story