- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Breaking: పుంగనూరు ఘటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆగ్రహం
దిశ, వెబ్ డెస్క్: పుంగనూరులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై దాడి అత్యంత హేయమైన చర్య అని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. మిథున్‌రెడ్డిపై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. టీడీపీ నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు మిథున్ రెడ్డి పుంగనూరు వెళ్లడం తప్పా అన్ని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఒక పార్లమెంటు సభ్యుడికే ఈ ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోయిందని విమర్శించారు. ఇక సామాన్య కార్యకర్తలను ఏవిధంగా రక్షస్తారని ప్రశ్నించారు. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతుందని, గతంలో ఎన్నడూ లేనటువంటి సంస్కృతిని సీఎం చంద్రబాబు పాలనలో చూస్తున్నామని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదనేది టీడీపీ శ్రేణులు గుర్తుపెట్టుకోవాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి హెచ్చరించారు.