- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala Samacharam: భక్తులతో కిక్కిరిసిన తిరుమల క్షేత్రం.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
దిశ, వెబ్‌డెస్క్: దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. బుధవారం శ్రీవారిని దర్శనానికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి ఖచ్చితంగా 17 నుంచి 18 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి భక్తుల శ్రీవారిని దర్శించుకేనేందుకు పోటెత్తారు.
ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఆళ్వార్ ట్యాంక్ అతిధి గృహం వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతోంది. బుధవారం స్వామి వారిని 81,930 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 41,224 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.90 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.