Tirumala Samacharam: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల క్షేత్రం.. సర్వదర్శనానికి 24 గంటల సమయం

by Shiva |
Tirumala Samacharam: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల క్షేత్రం.. సర్వదర్శనానికి 24 గంటల సమయం
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శనివారం, శ్రీవారిని దర్శనానికి జనం పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 26 గంటల సమయం పడుతోంది. ఆదివారం వారం సెలవు దినం కావడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. మరోవైపు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి భక్తుల శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు.

ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వ దర్శనానికి కంపార్టుమెంట్లు నిండి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతోంది. శనివారం స్వామి వారిని 90,721 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 50,599 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.28 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed