Tirumala : తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో పాముకాటుకు గురైన భక్తుడు

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-28 04:43:44.0  )
Tirumala : తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో పాముకాటుకు గురైన భక్తుడు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న భక్తుడిని పాము కాటు వేయడం తీవ్ర కలకలం రేపింది. చీరాలకు చెందిన భక్తుడు నాగేంద్ర(29) అనే యువకుడిని ఏడవ మైలు దగ్గర పాటు కాటు వేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన బాధితుడిని తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరిశీలించి యువకుడికి ప్రాణాపాయం లేదని తెలిపడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పాము ఆకుపచ్చ రంగులో ఉందని బాధితుడి సోదరుడు తెలిపారు. ఈ ఘటనతో నడకదారిలో వెళ్తున్న భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed