AP News:బాలుడి హత్య బాధాకరం.. నిందితులను కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్యే

by Jakkula Mamatha |
AP News:బాలుడి హత్య బాధాకరం.. నిందితులను కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్యే
X

దిశ,మడకశిర: మడకశిర మండలం ఆమిదాలగొండి గ్రామంలో చేతన్ అనే 8వ తరగతి బాలుడిని కిడ్నాప్ చేసి అటవీ ప్రాంతంలో హత్య చేసిన సంఘటన బాధాకరం అని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం బాలుడు మృతి పట్ల మడకశిర ఎమ్మెల్యే తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇలాంటి దుర్మార్గపు సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాలుడి హత్య కేసును 12 గంటల్లో ఛేదించిన జిల్లా ఎస్పీ, డీఎస్పీ, సీఐల, పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి దుర్మార్గపు సంఘటన ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed