- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టికెట్ రానివాళ్లే నా దృష్టిలో అత్యంత అదృష్టవంతులు.. మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : ఈ రోజుల్లో టికెట్ రాని వాళ్లే అత్యంత అదృష్టవంతులని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకలమర్రులో రుద్ర భూమి మహా ప్రస్థానం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాలు డబ్బుతో ముడి పడి ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూ.30 నుంచి రూ.50 కోట్ల మేర ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. ఆ రోజుల్లో ఎమ్మెల్యేలకు ఎంతో కొంత సంపాదించునేయ అవకాశం ఉండేదని తెలిపారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేక ఉన్నదంతా ఊడ్చుకుపోతోందని అన్నారు.
లెటెస్ట్ ట్రెండ్ ప్రకారం.. భారతదేశంలో సింగిల్ మ్యాన్ పార్టీల్లోని కొందరు ఎమ్మెల్యేలు మాత్రం తాము గెలుపొందగానే ఇసుక, మద్యం, మైన్స్‌ను బేస్ చేసుకుని సంపాదనకు ఎగబడుతున్నారని ఆరోపించారు. నేటి తరం ఎమ్మెల్యేలు నియెజకవర్గాలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించినా.. ప్రభుత్వ సహకారం ఉండట్లేదని అన్నారు. ఈ క్రమంలో ఎందుకు గెలిచానురా అని అంటూ ఎమ్మెల్యేలు తమలో తామే మథన పడుతున్నారని పేర్కొన్నారు. దీంతో టికెట్ రాని వారే అత్యంత అదృష్టవంతులని దగ్గుబాటి వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు.