నన్ను భయపెట్టడం ఈ జన్మకు సాధ్యపడదు: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వార్నింగ్

by Seetharam |
నన్ను భయపెట్టడం ఈ జన్మకు సాధ్యపడదు: ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో అసమ్మతి చల్లారడం లేదు.మెుదటి నుంచి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అసమ్మతి ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో బరస్ట్ సైతం అయ్యారు. మంత్రి జోగి రమేశ్ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని..మైలవరం వైసీపీలో ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేసి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఆధారాలతో సహా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎదుట ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ జోక్యం చేసుకుని సర్ధి చెప్పడంతో అప్పట్లో వివాదం సద్దుమణిగింది.తాజాగా సొంత పార్టీలోని అసమ్మతి వర్గానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మైలవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన చైర్మన్ నియామకం మహోత్సవంలో పాల్గొన్న వసంత కృష్ణప్రసాద్ అసమ్మతి నేతలపై మండిపడ్డారు. ‘నేను ఎంత సౌమ్యంగా ఉంటాను అనేది ఒక పక్క విషయం. రెండో పక్క కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు. భయపెట్టి లొంగదీసుకోవాలని అనుకుంటే ఈ జన్మకి సాధ్యపడదు అని వసంత కృష్ణప్రసాద్ హెచ్చరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్‌గా మారాయి.



Next Story

Most Viewed