VSR బీజేపీలో చేరతారనే ప్రచారం.. ఎంపీ పురందేశ్వరి రియాక్షన్ ఇదే!

by Jakkula Mamatha |
VSR బీజేపీలో చేరతారనే ప్రచారం.. ఎంపీ పురందేశ్వరి రియాక్షన్ ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ(YSRCP) కీలక నేత విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) రాజీనామా ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్‌గా మారింది. దీంతో అసలు వైసీపీలో ఏం జరుగుతుందన్న చర్చలు కొనసాగుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా రాజ్యసభకు రాజీనామా చేస్తున్నానని విజయసాయిరెడ్డి ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఇక VSR రాజీనామను నేడు(శనివారం) రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్(Rajya Sabha Chairman Jagdeep Dankar) ఆమోదించారు.

ఇదిలా ఉంటే.. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారన్న ప్రచారం పై రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎంపీ పురందేశ్వరి(MP Purandeswari) స్పందించారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. విజయసాయి బీజేపీలో చేరుతారని ప్రధాని మోడీ(PM Modi), అమిత్ షా(Amit Shah) చెప్పారా? అంటూ ప్రశ్నించారు. ప్రతి సభ్యుడికి వారిద్దరూ సపోర్ట్‌గా ఉంటారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ తనకు సపోర్ట్ చేశారని మాత్రమే విజయసాయిరెడ్డి అన్నారు అని ఆమె గుర్తు చేశారు.

Next Story