ఇదో ఫ్యాషన్ అయిపోయింది.. విజయసాయి రెడ్డి ప్రకటనపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2025-01-24 14:46:56.0  )
ఇదో ఫ్యాషన్ అయిపోయింది.. విజయసాయి రెడ్డి ప్రకటనపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్సీపీ(YSRCP Party) కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి(MP Vijayasai Reddy) రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అవుతున్నట్లు ప్రకటించాడు. దీనిపై సినీ నిర్మాత(Film Producer), కాంగ్రెస్ నేత(Congress Leader) బండ్ల గణేష్(Banla Ganesh) స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ధర్మమా..? అని హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ ట్విట్టర్ లో.. అధికారంలో ఉన్నప్పుడు అనుభవించి కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం, వదిలి వెళ్లిపోవడం చాలా మంది రాజకీయ నాయకులకి ఫ్యాషన్(Fashion) అయిపోయింది, ఇది ధర్మమా..! అని రాసుకొచ్చారు. కాగా విజయసాయి రెడ్డి.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, ఈ నెల 25న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ట్వీట్ చేశారు. అలాగే తాను ఏ పార్టీలో చేరడం లేదని, ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తగతం అని తెలిపారు. ఇక జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నానని, తన భవిష్యత్తు వ్యవసాయం అని రాసుకొచ్చారు.



Next Story

Most Viewed