- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘ఆడుదాం.. ఆంధ్రా’ పేరుతో రాష్ట్రంతో ఆటలాడారు.. వైసీపీపై అఖిలప్రియ ఫైర్

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆడుదాం.. ఆంధ్రా’ (‘Let’s play.. Andhra) పేరుతో గత వైసీపీ సర్కార్ (YCP Government) రాష్ట్రంతో ఆటలాడిందని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ (MLA Bhuma Akhila Priya) ఆరోపించారు. ఇవాళ అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ‘ఆమె ఆడుదాం.. ఆంధ్రా’ కార్యక్రమంపై మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు గత ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి ‘ఆడుదాం.. ఆంధ్రా’ ఈవెంట్‌ను నిర్వహించిందని తెలిపారు. ఫుట్‌బాల్ (Football)కు.. వాలీబాల్ (Volleyball)కు తేడా తెలియని వాళ్లను మంత్రి (మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి)ని చేశారని ఎద్దేవా చేశారు.
‘ఆడుదాం.. ఆంధ్రా’ పేరుతో మొత్తం రూ.400 కోట్ల మేర స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఆ ఈవెంట్‌లో మంత్రులు ఆడారు తప్ప.. ఆడగాళ్లను ప్రోత్సహించలేదని ఫైర్ అయ్యారు. నిరుపేద క్రీడాకారులకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి రోజా (Former Minister Roja), బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (Byreddy Siddharth Reddy) ఆధ్వర్యంలోనే స్కామ్ జరిగిందని సభ దృష్టి తీసుకొచ్చారు. మొత్తం స్కామ్ వెనుక తాడేపల్లి (Tadepally) కార్యాయం కూడా ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అఖియ ప్రియ (MLA Akhila Priya) ఆరోపణలపై సంబంధించ శాఖ మంత్రి బదులిచ్చారు. ‘ఆడుదాం.. ఆంధ్రా’పై విజిలెన్స్ (Vigilance), సీఐడీ (CID) విచారణ కొనసాగుతోందని బదులిచ్చారు.