రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు సృష్టిస్తున్నారు.. విష్ణువర్ధన్ రెడ్డి హాట్ కామెంట్స్

by Shiva |
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు సృష్టిస్తున్నారు.. విష్ణువర్ధన్ రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కావాలనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జల వివాదాలు సృష్టిస్తున్నారని ఏపీ బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్‌ రెడ్డి (Vishnuvardhan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జలాల (Krishna Water)ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) దోచేస్తుందంటూ సీఎం రేవంత్ అనడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఆ వ్యాఖ్యల పట్ల ఆంధ్రా ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణ జలాలు తమ హక్కు అని.. మా నీళ్లు మేము వాడుకుంటే అందులో దోపిడీ ఏముందని ప్రశ్నించారు. బాధ్యతయుతమైన పదవిలో ఉండి పక్క రాష్ట్రంలోని ప్రజలు, రైతులను దొంగలు అంటూ సంబోధించడం ఎంత వరకు కరెక్ట్ అని ఫైర్ అయ్యారు.

తమ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం (Central Government)తో కలుపుగోలుగా ఉంటూ.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను తెచ్చుకుంటోందని అన్నారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణ (Telangana)లోని కాంగ్రెస్ సర్కార్ (Congress Government) ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని కామెంట్ చేశారు. శ్రీశైలం డ్యామ్ (Srisailam Dam) ఎవరి త్యాగాలతో నిర్మించారో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి తెలియదా అని ధ్వజమెత్తారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సీఎం రేవంత్ కావాలనే లేని వివాదాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ (Congress Party) కనుమరుగు అవుతోందని.. రానున్న రోజుల్లో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని విష్ణువర్ధన్ రెడ్డి కామెంట్ చేశారు.

Next Story

Most Viewed