కుప్పంకు హంద్రీనీవా నీళ్లు.. పోరాటాలకు దిగుతామంటూ వైసీపీ నేత హెచ్చరిక

by srinivas |   ( Updated:2025-02-16 16:57:47.0  )
కుప్పంకు హంద్రీనీవా నీళ్లు.. పోరాటాలకు దిగుతామంటూ వైసీపీ నేత హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: కుప్పం(Kuppam)కు హంద్రీనీవా నీళ్ల(Handriniva water) తరలింపు ఇప్పుడు అభ్యంతరకరంగా మారుతోంది. హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు పూర్తి చేసి కడపకు కూడా నీళ్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) కృతనిశ్చయంతో పని చేస్తున్నారు. అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి(Former YCP MLA Topudurthi Prakash Reddy) అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హంద్రీనీవా పనులు పూర్తి చేస్తే కుప్పంకు నీళ్లు వెళతాయని, తద్వారా అనంతపురం జిల్లా(Ananthapura District)కు సాగు నీరు అందే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే హంద్రీనీవా లైనింగ్ పనులు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. కుప్పంకు నీళ్లు తరలించాలని చూస్తున్నారని, హంద్రీనీవా లైనింగ్ పనులు పూర్తయితే అనంతపురం జిల్లాకు సాగునీరు అందే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్ల కోసం పరిటాల సునీత పనులను సమర్థిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు.

Next Story

Most Viewed