- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Vijayawada: సబ్ జైలు దగ్గర ఉద్రిక్తత

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ సబ్ జైలు(Vijayawada Sub Jail) వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. వ్యక్తి కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)కి రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వంశీ భార్య, పేర్నినాని సబ్ జైలు వద్దకు వెళ్లారు. అయితే వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. జైలు సిబ్బంది తీరును తప్పుబట్టారు. ములాఖత్(Mulakat) కోసం వస్తే అడ్డుకుంటారా అంటూ జైలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో అరగంట సేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు వంశీ భార్యను, పేర్ని నానిని ములాఖత్‌కు అనుమతించారు.
అయితే జైలు ప్రాంగణం వద్దకు అనుమతి ఉన్న వాళ్లు మాత్రమే రావాలని సూచించారు. ఖైదీలను కలిసేందుకు ములాఖత్ తీసుకోవాలని, అలా కాదని నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జైలు సిబ్బంది హెచ్చరించారు.
మరోవైపు వల్లభనేని వంశీ అరెస్ట్‌ను వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. వల్లభనేని వంశీపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని మండిపడుతున్నారు. తమ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా తాము అండగా ఉంటామని అంటున్నారు.