- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీని వీడే ప్రసక్తే లేదు.. మరోసారి స్పష్టం చేసిన వైసీపీ ఎంపీ
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి పార్టీ వ్యూహాలను రచిస్తోంది. ముఖ్యంగా వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ ఆధారంగా చేస్తున్న మార్పులు చేర్పులు ఆ పార్టీ నేతల్లో అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ఇక ఇప్పటికే వైసీపీ అధిష్టానం తీరుపై అసహనానికి గురైన కొందరు నేతలు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పారు. మరి కొంతమంది నేతలు వైసీపీని వీడనున్నారు అనే వార్తలు కూడా జోరుగా ప్రచారమవుతున్నాయి.
అయితే ఇదే ప్రచారం నెల్లూరు ఎంపీ, నెల్లూరు రూరల్ వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న ఆదాల ప్రభాకర్‌రెడ్డిపై కూడా సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది. కాగా ఈ విషయం పై గతంలో క్లారిటీ ఇచ్చిన ఆయన.. పార్టీ వీడడం పైన మరోసారి కూడా స్పష్టత ఇచ్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. తనకు వైసీపీ లో మంచి ప్రాధాన్యత ఉందని.. సీఎం జగన్ తనకి విలువ ఇస్తారని.. అలాంటప్పుడు తానెందుకు పార్టీ వీడతాను అని నిలదీశారు. తన పైన వస్తున్నా వార్తల్లో నిజం లేదని.. తనని ప్రత్యక్షంగా ఎదురుకోలేక టీడీపీ నేతలు ఇలా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను రాజకీయాలనుండి తప్పుకుంటానేమోగాని వైసీపీని వీడి టీడీపీ లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.