AP Politics:జగనన్న నినాదంతో గర్జించిన గాలివీడు

by Jakkula Mamatha |   ( Updated:2024-04-18 13:43:22.0  )
AP Politics:జగనన్న నినాదంతో గర్జించిన గాలివీడు
X

దిశ ప్రతినిధి,రాయచోటి: నియోజకవర్గంలో అభిమానులు,మహిళలు అడుగడుగునా ఇంటింటి దగ్గర నీరాజనం పలికారు. మహిళలు కర్పూర హారతులు పట్టారు. స్థానిక అభిమానులు, వారి దుకాణాలు, నివాసం వద్ద దారిపొడవునా పూల దండలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్రమంతా మరోసారి వైఎస్ఆర్‌సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రమైన గాలివీడు లో శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డిలు ఇంటింటి ప్రచారం నిర్వహించి ఫ్యాను గుర్తుకు ఓట్లు వేయ్యాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ. జగన్ పాలనలో అర్హతే ఆధారంగా సంక్షేమ ,అభివృద్ధి ఫలాలు అందాయన్నారు. గాలివీడు మండల కేంద్రంలో రూ 7 కోట్లతో నాలుగు వరుసల రహదారిని సుందరంగా నిర్మింపచేశామన్నారు. మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రోజు రోజుకూ వైఎస్ఆర్సిపి గ్రాఫ్ పెరుగుతోందన్నారు.

Advertisement

Next Story