- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు.. ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు.. ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్ : స్కిల్ డెవెలప్‌మెంట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులను వెలువరిచింది. ఈ నేపథ్యంలో ఆ తీర్పులపై అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే, కేసు నుంచి తప్పించుకోవాలని బాబు వేసిన పథకాలు పని చేయలేదని అన్నారు. చివరికి సుప్రీం ధర్మాసనం కూడా పిటిషన్‌ను ఎక్కడా అనుమతించ లేదని స్పష్టం చేవారు. బాబును తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయించారని, ఇన్నాళ్లు ఆయన చేసిన ప్రచారం తప్పని తేలిందని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు.
Next Story