- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రశ్నకు సమాధానం లేదన్న మంత్రి.. నిలదీసిన టీడీపీ ఎమ్మెల్యే..
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్య ప్రసాద్ ఆరోపణలకు సంబంధించిన ప్రశ్నను, రాష్ట్రం లో ప్రాధమిక వైద్య శాలలు గురించి మొదటి ప్రశ్నగా 1850 కు సమాధానం చెప్పాల్సిందిగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య శాఖ మంత్రిని స్పీకర్ అడిగారు. ఈ నేపథ్యంలో విడదల రజినీ ఏ ప్రశ్నకు సమాధానం లేదని.. బి ప్రశ్నకు సమాధంగా ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, అలానే సి ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అని తెలిపారు.
విడదల రజని సమాధానాలు విన్న స్పీకర్.. వీరాంజనేయ స్వామిని ఆ ప్రశ్నపై మాట్లాడాల్సిందిగా కోరారు. ఈ నేపధ్యంలో ప్రస్తావించిన టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నత శ్రేణి ఆసుపత్రును జీవో నెంబర్ 143 ద్వారా సాధారణ స్థాయి ఆసుపత్రులుగా మార్చిన మాట వాస్తవమని పేర్కొన్నారు. ఇక గౌరవనీయులు మంత్రిగారు లేదని చెప్పారని.. కానీ తమ ప్రకాశం జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 2007 లో సింగరాయకొండ పిహెచ్ సిలని అప్ గ్రేడ్ పిహెచ్ సి లగా చేసారని తెలిపారు.
ఇక ఆ పిహెచ్ సి లలో ఒక డిప్యూటీ సివిల్ సర్జన్, 5 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఒక డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 7 మంది స్టాఫ్ నర్సులు, హెడ్ నర్స్ ను సిబ్బందిగా నియమించారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ సిబ్బందిని తక్కువకు కుదించారని ఆరోపించారు. తన తండ్రిగారైన రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏడుగురు స్టాఫ్ నర్సులు సేవలందిస్తే ప్రస్తుతం ముగ్గురు స్టాఫ్ నర్సులు సేవలందిస్తున్నారని మండిపడ్డారు.
ఇక ఆ సుపత్రుల్లో డెలివరీలు తగ్గిపోయాయని.. ఒపిలు తగ్గి పోయాయని.. ఆపరేషన్లు కూడా తగ్గిపోయాయని.. ఇలాంటి నేపథ్యంలో మీరు అడిగిన ప్రశ్నకు సంబంధిత మంత్రి సమాధానం లేదని, ఉత్పన్నం కాదు అని బదులివ్వడం సరైన పద్ధతి కాదని వెల్లడించారు.
Read More..
Breaking: ధైర్యంగా వెళ్లి ఓట్లు అడుగుతున్నామంటే కారణం అదే..! అంబటి..