- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: వైసీపీ ఆరో జాబితా విడుదల.. ఇంచార్జులు వీరే..
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఆరో జాబితా విడుదల అయింది. పలు నియోజకవర్గాలకు ఆ పార్టీ అధిష్టానం కొత్త ఇంచార్జులను ఖరారు చేసింది. ఈ మేరకు కసరత్తులు చేసిన అధిష్టానం చివరకు కొందరి పేర్లను ప్రకటించారు. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కొత్త ఇంచార్జిగా నాగార్జునరెడ్డి, ఎమ్మిగనూరు అసెంబ్లీకి బుట్టా రేణుక, గుంటూరు (ఎంపీ) ఉమ్మారెడ్డి రమణ, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్పను ఖరారు చేశారు. మొత్తం 4 ఎంపీ, 6 అసెంబ్లీ స్థానాలకు ఇంచార్జుల జాబితాను విడుదల చేశారు.
వారి జాబితా ఇదే..
రాజమండ్రి (ఎంపీ)-గూడూరు శ్రీనివాస్
నర్సాపురం (ఎంపీ)- అడ్వకేట్ గూడూరి ఉమాబాల
నెల్లూరు సిటీ (అసెంబ్లీ)-ఎండీ అఖిల్
మైలవరం (అసెంబ్లీ)-సర్నాల తిరుపతిరావు యాదవ్
మార్కాపురం (అసెంబ్లీ)- అన్నా రాంబాబు
జీడీ నెల్లూరు (అసెంబ్లీ)-కె. నారాయణ స్వామి
కాగా వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచేందుకు వైసీపీ అధిష్టానం వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా పలు నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జులను నియమిస్తోంది. ఇప్పటికే 5 జాబితాలు విడుదల చేసింది. మొత్తం 61 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే , 14 ఎంపీ స్థానలకు ఇంచార్జులను ప్రకటించారు. అయితే ఈ నియోజకవర్గాల్లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలింది. వారిని కాదని కొత్త వారికి అవకాశం కల్పించారు. ఇప్పుడు తాజాగా విడుదల చేసిన ఆరో జాబితాలోనూ కొత్త వారికి కల్పించారు.
Read More..
Ap News: విశాఖ రైల్వే జోన్‌పై చెరో మాట.. ఎవరు చెప్పేది నిజం.. ఆలస్యానికి కారణం అదేనా.. !