Breaking:ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..ఆ ప్రాజెక్టుల పేర్లు మార్పు

by Jakkula Mamatha |   ( Updated:2024-08-10 05:54:31.0  )
Breaking:ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..ఆ ప్రాజెక్టుల పేర్లు మార్పు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు సంక్షేమ పథకాల పేర్లు మార్పు చేసిన సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్లు మార్పు చేసింది. ఈ క్రమంలో నేడు(శనివారం) ఏపీలోని పలు ప్రాజెక్టుల పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 12 సాగునీటి ప్రాజెక్టుల పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పేర్లనే పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టును గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా, వైఎస్సార్ వేద్రాది ఎత్తిపోతలను ముక్త్యాల ఎత్తిపోతలుగా మార్చింది. వరికపూడిశెల, సంగం బ్యారేజీ, తాటిపూడి రిజర్వాయర్ , హంద్రీనీవా సుజల స్రవంతి పేర్లనూ పునరుద్ధరించింది.

Advertisement

Next Story

Most Viewed