- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్నికల కోడ్ ను తుంగలో తొక్కిన అధికార పార్టీ.. వివాదాస్పదంగా వైసీపీ తీరు
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూసింది. అయితే అధికార పార్టీ ఎన్నికల కోడ్ నిబంధలను ఖాతరు చెయ్యడం లేదు. ఏదేశ్చగా ఎన్నికల కోడ్ నిబంధలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీనితో వైసీపీ నేతల తీరు ఆయా ప్రాంతాలలో వివాదాలకు దారితీస్తోంది. ముఖ్యంగా కడప జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు గురవుతోంది.
కడప జిల్లా లోని పోరుమామిళ్ల మండలం రామయ్యపల్లె గ్రామంలో ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోని అధికార ప్రభుత్వం, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు తొలిగించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలానే వైసీపీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్నా అధికారులు నిర్ల్యక్ష ధోరణిని ప్రదర్శిస్తున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
అలానే అనంతపురం లోనూ ఎన్నికల కోడు ఉల్లంఘనంకు గురవుతుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అనంతపురం లోని గుంతకల్ ప్రధాన రహదారిపై వై.ఎస్.ఆర్ వైవీఆర్ క్యాంటీన్ ఉంది. కాగా ఆ క్యాంటీన్ పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి పోస్టర్లు ఉన్నాయి. అయితే ఆ పోస్టర్లను తొలిగించేందుకు మున్సిపల్ అధికారులు భయపడుతున్నారు.
అయితే ఎన్నికల కోడ్ అమలు జరిగిన ఇప్పటికి ఆ క్యాంటిన్ పై సీఎం జగన్, ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి పోస్టర్లను మున్సిపల్ అధికారులు తొలిగించకుండా నిర్లక్ష్య ధోరణిని వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఆ పోస్టర్లను తొలిగించాలని డిమాండ్ చేస్తున్నాయి.
Read More..