- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
గుంజీలు తీయించిన ప్రిన్సిపాల్.. విచారణకు ఆదేశించిన ఎమ్మెల్యే
దిశ, వెబ్‌డెస్క్: స్టూడెంట్స్ (Students)ని క్రమశిక్షణలో పెట్టాలనే ఉద్దేశంతో ఓ ప్రిన్సిపల్ (Principal) చేసిన నిర్వాకం 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యేలా చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం (Rampachodavaram)లోని ఏపీ గిరిజన గురుకుల కళాశాలలో 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మాట వినడం లేదంటూ రెండు, మూడు రోజుల నుంచి వరుసగా రోజూ విద్యార్థినులతో 200 గుంజీలు తీయిస్తున్నారు. సోమవారం కూడా గుంజీల పనిష్మెంట్ (Panishment) కొనసాగడంతో కొంతమంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలియడంతో విద్యార్థునుల తల్లిదండ్రులు వెంటనే కళాశాలకు చేరుకుని తమ పిల్లలను స్థానిక రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చెప్పిన మాట వినడం లేదనే నెపంతో కళాశాల ప్రిన్సిపల్ ప్రసూన, పీడీ కృష్ణకుమారి విద్యార్థినులతో గుంజీలు తీయించారని తల్లిదండ్రులు (Parenrts) ఆరోపించారు. ఒక్కసారిగా 200 గుంజీలు తీయడంతో 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వారు పేర్కొన్నారు.
కాగా.. ఈ వ్యవహారం బయటకు రావడం, విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన కళాశాల ప్రిన్సిపల్, పీడీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు (Students Union), తల్లిదండ్రులు డిమాండ్ చేయడంతో స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి (MLA Miriyala Sirisha Devi) వెంటనే స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలాన్ని ఆదేశించారు. అనంతరం స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను శిరీషా దేవి పరామర్శించారు.