- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పార్టీ ఎవరినీ వదులుకోదు...అందరి సేవలు వినియోగించుకుంటాం: కొత్త ఇన్‌చార్జిలపై వైసీపీ నేతలు
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో 11 నియోజకవర్గాల ఇన్‌చార్జిలను మారుస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జిలను సైతం నియమించింది. ఈ మేరకు ప్రకటన సైతం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే కొత్త ఇన్‌చార్జిల నియామకాలపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ఇన్‌చార్జిలు అంతా తక్షణమే ఆయా నియోజకవర్గాల పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. పార్టీ ఎవర్నీ వదులుకోదు అని...అందరీ సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. 175కు 175 సీట్ల సాధనే లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. అణగారిన వర్గాల వారికి ధైర్యం ఇచ్చి పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏదో మాటలు చెప్పి చేయడం లేదు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలుపే ప్రతిపాదికన ఈ నిర్ణయం తీసుకున్నట్ల మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
అన్నీ ఆలోచించాకే నిర్ణయం: సజ్జల
కొత్త ఇన్‌చార్జిల నియామకాల విషయంలో అన్నీ శాస్త్రీయంగా పరిశీలించాకే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పుడు మార్చిన ఈ 11 మంది గెలవరని కాదని....ఇంకా మంచి మెజార్టీతో గెలవాలన్నదే తమ ఆలోచన అని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షానికి ఒక దారీ తెన్నూలేకుండా పోతోంది. ఎక్కడ ఎవరు పోటీ చేస్తారో కూడా తెలియని పరిస్థితి వారిది. కానీ మన పార్టీలో అన్నీ చర్చించే నిర్ణయం అని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.