- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వై.ఎస్.ఆర్.సి.పీ అర్ధం మార్చిన పార్టీ.. అసలు అర్ధం ఇదే..
దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారిన విషయం తెనాలికి చెందిన గీతాంజలి మరణం. ఆమె మరణం ప్రస్తుతం రాజకీయంగా మారింది. వైసీపీకి మద్దతుగా మాట్లాడిందని ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఆమె పై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ చేయించిందని.. ఆ ట్రోలింగ్ కారణంగా ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికార పార్టీ ఆరోపిస్తోంది.
అయితే ఈ నెల 8వ తేదీన ట్రోలింగ్ మొదలైతే.. ఆమె ఒక రోజు ముందు అనగా 7వ తేదీన ఎలా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది అని టీడీపీ ఆధారాలతో ప్రశ్నించింది. అలానే ఆమెను ఎవరో రైలు కింద తోసేశారు అని ఘటనా స్థలంలో స్థానికులు మాట్లాడిన వీడియోని కూడా బయటపెట్టారు. అయితే తాజాగా టీడీపీ ట్విట్టర్ (X) వేదికగా వైసీపీకి కొత్త అర్ధం చెబుతూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది.
YSRCP అంటే యువతి శవంతో రాజకీయాలు చేసే పార్టీ అని పేర్కొంది. కాగా ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ పలురాకాలుగా కామెంట్ చేస్తున్నారు. గతంలో బాబాయి హత్యను కూడా ‘నారాసుర రక్త చరిత్ర’ అని చంద్రబాబుకు రక్తపు మరకలు అంటించే ప్రయత్నం చేశారు. జగన్ రెడ్డి పాలనలో తల్లికీ, చెల్లికే రక్షణ లేకుండా పోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Y- యువతిS - శవంతోR -రాజకీయాలుC- చేసే— Telugu Desam Party (@JaiTDP) March 12, 2024