అంతా అయిపోయింది.. గాజు గ్లాసు గుర్తుపై షాక్ ఇచ్చిన ఈసీ

by Disha Web Desk 16 |
అంతా అయిపోయింది.. గాజు గ్లాసు గుర్తుపై షాక్ ఇచ్చిన ఈసీ
X

దిశ, వెబ్ డెస్క్: గాజు గుర్తు విషయంలో తెలుగుదేశం పార్టీకి టెన్షన్ తప్పడంలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. అయితే జనసేనకు ఫ్రీ సింబల్‌గా గాజు గ్లాసును ఎన్నికల సంఘం కేటాయించింది. జనసేన పోటీ చేసే ఎంపీ, అసెంబ్లీ స్థానాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల ఇతర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును అధికారులు కేటాయించారు. దీంతో టీడీపీ నేతల్లో టెన్షన్ పట్టుకుంది. జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాల్లో తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. ఆయా స్థానాల్లో టీడీపీకి పడాల్సిన ఓట్లు ఓటర్లు గాజు గ్లాసుకు వేస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. టీడీపీకి పడే ఓట్లు బదిలీ అయితే తమ అభ్యర్థులకు నష్టమని టెన్షన్ పడుతున్నారు. జనసేనకు తప్ప మిగిలిన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అయితే సింబల్స్ కేటాయింపు ప్రక్రియ పూర్తి అయిందని కోర్టుకు ఈసీ వివరించింది. బుధవారం రాత్రే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పత్రాలు ఆర్మ్‌డ్ ఫోర్స్‌కు పంపినట్లు తెలిపింది. హౌస్, పోస్టల్ బ్యాలెట్ల ప్రక్రియ అన్ని నియోజకవర్గాల్లో చేపట్టినట్లు పేర్కొంది. దీంతో ఇరువర్గాల విన్న హైకోర్టు విచారణ సోమవారానికి వాయిదా వేసింది.


Read More..

ఆంధ్రప్రదేశ్‌లో 14 సమస్యాత్మక నియోజకవర్గాలను గుర్తించిన ఈసీ

Next Story

Most Viewed