- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ మంత్రి.. అడ్డుకున్న అధికారులు
దిశ వెబ్ డెస్క్: టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తులు ఖాయమైనట్టు అధికారికంగా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ పొత్తుల అంశంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ విశాఖలో ప్రెస్ మీట్ నిర్వహించాలి అనుకున్నారు. అందుకు మీడియాని కూడా పిలిచారు. అయితే పొలిటికల్ ప్రెస్ మీట్ కు అనుమతులు లేవని సర్క్యూట్ హౌస్ అధికారులు తేల్చి చెప్పారు.
గతంలోనూ లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ కి అనుమతించని విషయం అందరికి తెలిసిందే. అయితే అమర్నాథ్ తాను మంత్రిని కనుక తనకు ప్రెస్ మీట్ కి అనుమతిస్తారని అత్యుత్సాహం ప్రదర్శించారు. అయితే రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అనేలా సర్క్యూట్ హౌస్ అధికారులు వ్యవహరించారు. అక్కడఅధికారిక పరమైన కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఉంటుందని.. పార్టీ పరమైన కార్యక్రమాలకు అనుమతి లేదని.. మంత్రి అయినా సరే పొలిటికల్ ప్రెస్ మీట్ కి అనుమతి లేదని ఖరాకండిగా చెప్పారు. దీనితో ఇక చేసేదేమీ లేక మంత్రి అమర్నాథ్ చెట్టు కిందనే ప్రెస్ మీట్ పెట్టి మమ అనిపించారు.