- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహిళలకు గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో భారీగా డబ్బులు
దిశ, వెబ్ డెస్క్మరికొన్ని గంటల్లో రాష్ట్రంలోని ఈబీసీ మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 45 వేలు జమ కానుంది.. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఈబీసీ నేస్తం నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. నంద్యాల జిల్లా బనగానపల్లిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఈబీసీ నేస్తం డబ్బులను మహిళల ఖాతాల్లో జమ చేయనున్నారు. అగ్రవర్ణాలలోని పేద మహిళల కోసం 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ. 15 వేలు చొప్పున మూడేళ్లకు గాను మొత్తం రూ.45 వేలు ఆర్థిక సాయం చేయనున్నారు.
కాగా కర్నూలు, నంద్యాల జిల్లాలో గురువారం సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి ఆయన కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు చేరుకుంటారు. అక్కడే ఏర్పాటు నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేస్తారు. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లికి చేరకుని అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ఈబీసీ నేస్తం డబ్బులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు.