- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
దిశ, వెబ్ డెస్క్: ఏపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. రాష్ట్రానికి చెందిన 9 మంది అభ్యర్థుల సహా 11 మందితో కూడిన జాబితాను ఏఐసీసీ ప్రకటించింది. శ్రీకాకుళం ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా డా. పరమేశ్వరరావు, విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా జంగా గౌతమ్, మచిలీపట్నం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా గొల్లు కృష్ణ, విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వల్లూరు భార్గవ్, ఒంగోలు -సుధాకర్ రెడ్డి, నంద్యాల- లక్ష్మినరసింహ యాదవ్, అనంతపురం- మల్లికార్జున్, హిందూపురం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా సమద్ వహీన్‌ను కాంగ్రెస్ ప్రకటించింది.
అయితే కడప నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆమె ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల దూసుకుపోతున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీలపై ఆమె విమర్శలు కురిపిస్తున్నారు. రాష్ట్ర విభజనతో బలహీనమైన కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల రాకతో పూర్వ వైభవం సంతరించుకుంది. కాంగ్రెస్ సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు వైఎస్ షర్మిల తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.