- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ముద్రగడ ఇంటి పై దాడి.. స్పందించిన జనసేన అధ్యక్షుడు

దిశ,వెబ్‌డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada Disrtict) కిర్లంపూడిలో వైసీపీ నేత(YCP Leader) ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) ఇంటి పై ఈ రోజు(ఆదివారం) ఉదయం దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రాక్టర్‌తో ముద్రగడ ఇంటి గేటును ఓ వ్యక్తి ఢీకొట్టాడు. అంతేకాదు అక్కడే పార్క్ చేసి ఉన్న కారు(Car)ను కూడా ఢీకొట్టడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక ఈ దాడి విషయం తెలిసి ముద్రగడ అనుచరులు ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే ముద్రగడ వర్గీయులు కొందరు దాడి చేసిన వ్యక్తిని జనసేన(Janasena) కార్యకర్తగా అనుమానిస్తున్నారు. దాడికి పాల్పడిన ఆ వ్యక్తిని పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు రూ.50 వేలు ఇస్తానంటేనే ఎటాక్ చేశానని ఆ వ్యక్తి చెబుతున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ ఘటన పై తాజాగా జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు(Tummala Babu) ముద్రగడ కారుపై దాడి ఘటనపై స్పందించారు. జనసేన పార్టీ(Janasena Party) విలువలతో ఏర్పడిన పార్టీ అని పేర్కొన్నారు. ఇలాంటి దాడులు ఎవరి మీద జరిగినా అది తప్పు అని తేల్చి చెప్పారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. దాడి చేసిన వ్యక్తి జనసేన కార్యకర్త అని ప్రచారం జరుగుతుంది. ఆ వ్యక్తిని తాను జనసేనలో ఎప్పుడు చూడలేదని తెలిపారు. ఈ క్రమంలో పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని జనసేన నేత తుమ్మల అధ్యక్షుడు అన్నారు.