ఆ నియోజకవర్గంలో ఆగని వలసలు..వైసీపీని వీడి టీడీపీలో చేరిక

by Jakkula Mamatha |
ఆ నియోజకవర్గంలో ఆగని వలసలు..వైసీపీని వీడి టీడీపీలో చేరిక
X

దిశ,మడకశిర:నియోజకవర్గం చందకచెర్ల గ్రామ పంచాయతీ అచ్చంపల్లి మరువ పల్లి గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు ఆదివారం మడకశిర టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.ఈ మేరకు కోటి నాయక్ ,లక్ష్మీ నాయక్, రాజు నాయక్, శ్రీరామ నాయక్, మాజీ వార్డ్ మెంబర్ యల్లప్ప తదితర మొత్తం 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ కార్యక్రమంలో కుంచిట్టిగా ఒక్కలిగా సాధికార సమితి కన్వీనర్ పాండురంగప్ప, మాజీ ఎంపీపీ బొజ్జప్ప చందకచెర్ల సర్పంచ్ దేవుల నాయక్ ,మాజీ మండల కన్వీనర్ రామాంజనేయులు ,మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాష్ నాయక్ నాయకులు క్రిష్టప్ప, గురు సిద్ధప్ప, మాజీ చైర్మన్ మల్లేశప్ప, శేషాద్రి రాంభూపాల్ రెడ్డి, రమేష్, మూర్తి ,నాయక్ ప్రకాష్ నాయక్ గంగాధర్ వార్డు నెంబర్ వెంకటేష్ గోపీనాయక్, రామన్న , తదితర తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకుల పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed