Breaking: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్..?

by srinivas |   ( Updated:2025-02-12 14:01:15.0  )
Breaking: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్..?
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో మరోసారి కులగణన చేపడుతున్నట్లు తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యంగా జరిగే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా ప్రభుత్వం గతంలోనే కులగణన చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు కొంతమంది కులగణనలో పాల్గొనలేదు. దీంతో వారి కోసం ప్రభుత్వం ఆలోచన చేసింది. మరోసారి సర్వేలో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. కులగణన, రిజర్వేషన్లపై సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఈ నెల 16 నుంచి 28 వరకూ ప్రభుత్వ సిబ్బంది కులగణన సర్వే నిర్వహించనునట్లు పేర్కొన్నారు. గత కులగణనలో పాల్గొనని వారు ఈసారి తప్పక నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో చట్టం చేస్తామని, ఆ తర్వాత పార్లమెంట్‌కు పంపుతామని ఆయన వెల్లడించారు. 42 శాతం ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని భట్టి స్పష్టం చేశారు.


అయితే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేసింది. ఈ మేరకు ప్రతిపాదనలను ఎన్నికల సంఘానికి పంపింది. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతున్న వేళ.. మళ్లీ కులగణన తెరపైకి వచ్చింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరగతాయా.. లేదా కొంత కాలం వాయిదా పడతాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..!..

Next Story