AP Pensions: వారిని జాబితా నుంచి తొలగించిన ప్రభుత్వం.. ఇక నో పెన్షన్?

by Jakkula Mamatha |   ( Updated:2025-02-01 13:29:20.0  )
AP Pensions: వారిని జాబితా నుంచి తొలగించిన ప్రభుత్వం.. ఇక నో పెన్షన్?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్ర అభివృద్ధే(State Development) లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ(Distribution of pensions)ని ఈ రోజు(శనివారం) తెల్లవారుజామున 6 గంటల నుంచే ప్రారంభించింది. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సచివాలయ ఉద్యోగులు(Secretariat employees) ఇంటింటికీ వెళ్లి పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు.

అయితే.. రేపు ఆదివారం కావడంతో నేడే 100 శాతం పంపిణీ పూర్తవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం(Government) పెన్షన్లు పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో ఎవరికైనా పెన్షన్ రాకపోతే (ఫిబ్రవరి 3) సోమవారం ఇచ్చేలా ప్రణాళిక వేసుకుంది. ఇదిలా ఉంటే.. గత(జనవరి) నెలలో ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లను(Disability pensions) పునఃపరిశీలించింది. అర్హత లేని వారు పెన్షన్లు పొందుతున్నారని తెలియడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వైకల్యం లేని వారు కూడా ఉన్నట్లుగా బోగస్ సర్టిఫికెట్లు(Bogus certificates) పెట్టి పెన్షన్ తీసుకుంటున్నారని అధికారులు తేల్చడంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వైకల్య పరీక్షలు నిర్వహిస్తోంది.

ఈ క్రమంలో కొంతమంది అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించారు. దీంతో పాటు చనిపోయిన వారి పేర్లను కూడా తొలగించారు. దివ్యాంగ పింఛన్లు అనర్హులను ప్రభుత్వం తొలగించడంతో జనవరిలో 63,77,943 మంది పింఛన్ లబ్దిదారులు ఉండగా.. ఫిబ్రవరి వచ్చేసరికి పింఛన్ దారుల సంఖ్య 63,59,907కు తగ్గింది. దీంతో పింఛన్ల జాబితా నుంచి తొలగించిన 18,036 మంది ఇకపై పింఛన్ పొందలేరు. వారంతా ఎవరు? ఏయే జిల్లాలో ఉన్నారు అనే విషయం తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed