మరోసారి కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు తీసుకున్న ప్రభుత్వం.. ఈసారి ఎంతంటే?

by Anjali |   ( Updated:2023-12-19 14:39:21.0  )
మరోసారి కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు తీసుకున్న ప్రభుత్వం.. ఈసారి ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం మరోసారి కేంద్రం ప్రభుత్వం నుంచి అప్పు తీసుకుంది. తాజాగా మరో రూ.5858 కోట్ల అప్పు తీసుకుంది. అదనపు అప్పుకు కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. విద్యుత్‌ రంగంలో సంస్కరణలు అమలు చేసినందుకు గానూ.. అదనంగా 0.5% రుణాలు పొందేందుకు రాష్ట్రాలకు కేంద్రం అవకాశం కల్పించింది. దీనిలో ప్రధానంగా మూడు అంశాలను అమల్లోకి తీసుకువచ్చినందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఈ అవకాశం కల్పించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 12 రాష్ట్రాలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగా ప్రస్తుతం 6 రాష్ట్రాలకే ఈ చాన్స్ లభించింది.

15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు మార్కెట్‌ నుంచి అదనపు రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. కేంద్రం ప్రకటించిన 6 రాష్ట్రాల్లో ఏపీ రాష్ట్రం కూడా ఉంది. 2021-22 లో రూ. 3716 కోట్ల అప్పు తీసుకున్న ఏపీ సర్కారు.. ఇప్పుడు 5858 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు అస్సాం, కేరళ, రాజస్థాన్‌, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌కి అదనపు రుణాలు పొందే అనుమతిని కేంద్రం కల్పించిందని ట్విటర్ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.


Read More..

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. తెలంగాణకు పూర్తి స్థాయి DGP నియామకం

Advertisement

Next Story

Most Viewed