మూగబోయిన స్వరం.. ప్రముఖ సంగీత విద్వాంసుడు కన్నుమూత

by Jakkula Mamatha |   ( Updated:2025-03-09 14:23:29.0  )
మూగబోయిన స్వరం.. ప్రముఖ సంగీత విద్వాంసుడు కన్నుమూత
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ సంగీత విద్వాంసుడు(Musician) గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్(76) కన్నుమూశారు. గుండెపోటుతో తిరుపతి(Tirupati)లోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈయన వెయ్యికి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో 1978 నుంచి 2006 వరకు గరిమెళ్ల ఆస్థాన గాయకుడిగా ఉన్నారు. గరిమెళ్ల బాలకృష్ణ వినరో భాగ్యము విష్ణు కథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకు స్వరాలు సమకూర్చారు.

అంతేకాదు సంప్రదాయ కర్ణాటక సంగీతంలో లలిత సంగీతంలో జానపద సంగీతంలోనూ పాట పాడారు. ఈయన భౌతిక దేహానికి టీటీడీ మాజీ చైర్మన్(Former TTD Chairman) భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) నివాళులర్పించారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్(Garimella Balakrishna Prasad) మరణం తిరుమల(Tirumala) వేంకేటేశ్వర స్వామి భక్తుల(Devotees)కు తీరని లోటు అన్నారు. అన్నమయ్య కీర్తనలను గానం చేసి నేటి తరం భక్తులకు అందించిన మహనీయులు గరిమెళ్ల మృతి బాధాకరం అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన పేర్కొన్నారు.

Next Story