ఏపీ డీజీపీని వదలని సైబర్‌ కేటుగాళ్లు.. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌పై నకిలీ ఉత్తర్వులు జారీ

by srinivas |
ఏపీ డీజీపీని వదలని సైబర్‌ కేటుగాళ్లు.. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌పై నకిలీ ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: సైబర్ కేటగాళ్లు ఏపీ డీజీపీని కూడా వదిలిపెట్టలేదు. ఆయన పేరుతో ఫేక్ లెటర్ రిలీజ్ చేసి కలకలం సృష్టించారు. హోమ్‌గార్డ్స్‌ సివిల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌(Home Guards Civil Police Recruitment)పై డీజీపీ ద్వారకా తిరుమలరావు(DGP Dwaraka Tirumala Rao) పేరుతో నకిలీ ఉత్తర్వులు జారీ చేశారు. హోమ్‌గార్డ్‌ పోలీసులకు వచ్చే నెల 10 నుంచి ట్రైనింగ్‌ జరుగుతుందని, 17 నుంచి జాయినింగ్‌ ఉంటుందటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన డీజీపీ కార్యాలయం.. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించింది. ఫేక్ లెటర్ రిలీజ్ కావడంపై విచారణ చేపట్టాలని సైబర్‌క్రైమ్‌(Cybercrime) పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఎవరు..?, ఎక్కడి నుంచి లెటర్ విడుదల చేశారనే కోణంలో విచారణ చేపట్టారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు. తప్పుడు ప్రచారాలు చేస్తే అసలు వదిలిపెట్టమని, కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed