MLC election: వారిద్దరి మధ్య ఓట్ల తేడా 331.. ఉత్కంఠగా కౌంటింగ్​

by Anil Sikha |   ( Updated:2025-03-03 10:41:27.0  )
MLC election: వారిద్దరి మధ్య ఓట్ల తేడా 331.. ఉత్కంఠగా కౌంటింగ్​
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ (teachers mlc)ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. తొలి ప్రాధాన్యత ఓట్లలో పీఆర్టీయూ(prtu) అభ్యర్థి శ్రీనివాసులు నాయుడుకి 6927 ఓట్లు వచ్చాయి. ఏపీటీఎఫ్, (aptf) కూటమి మద్దతు పలికిన రఘువర్మకు 6,596 ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్లతో యూటీఎఫ్ (utf)అభ్యర్థి విజయ గౌరికి 5684 ఓట్లు వచ్చాయి. పాకలపాటి రఘువర్మ, గాదె శ్రీనివాసులు మధ్య కేవలం 331 ఓట్ల వ్యత్యాసం ఉంది. గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ (postal ballet) ఓట్ల గ్రేడింగ్ పూర్తయింది. మొదటి రెండు పూర్తి అవ్వడానికి రేపు ఉదయం వరకు సమయం పడుతుంది. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఓట్లకు (graduates votes) సంబంధించి మొత్తం 371 పోస్టల్​బ్యాలెట్లు వచ్చాయి. అందులో 316 మాత్రమే చెల్లుబాటు అయ్యాయి అని కలెక్టర్​ నాగలక్ష్మి తెలిపారు. గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఏలూరు సీఆర్​ రెడ్డి కాలేజిలో ఓట్ల లెక్కింపు మొదలైంది. 17 రౌండ్లలో కౌంటింగ్​ జరుగుతోంది. 700‌‌‌‌ మంది సిబ్బంది ఇందుకు కేటాయించారు.

Next Story

Most Viewed