రూ.40 లక్షలతో మోడ్రన్ బస్ షెల్టర్ నిర్మాణం.. ఐదు రోజులకే కుంగిపోయింది

by Seetharam |
రూ.40 లక్షలతో మోడ్రన్ బస్ షెల్టర్ నిర్మాణం.. ఐదు రోజులకే కుంగిపోయింది
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ మహా నగరపాలక సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మోడ్రన్‌ బస్‌ షెల్టర్‌ కుంగిపోయింది. బస్ షెల్టర్ కుంగిపోయినప్పుడు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఇకపోతే జీవీఎంసీ కార్యాలయం ఎదుట జీవీఎంసీ ఆర్టీసీ బస్‌ షెల్టర్‌ని నిర్మించింది. రూ.40లక్షల వ్యయంతో మోడ్రన్ బస్ షెల్టర్‌ పేరుతో మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ బస్ బేను ప్రారంభఇంచిన ఐదు రోజులకే ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయలతో నిర్మించిన బస్ బే కనీసం ఐదు రోజులు కూడా నిలవలేదని విమర్శిస్తున్నారు. దీని పరిస్థితి ఇలా ఉంటే ఇక జీవీఎంసీ పరిధిలో మిగిలిన 19 బస్ షెల్టర్స్ సంగతేంటని అంటున్నారు. నాసిరకం పనుల ఫలితమే బస్ షెల్టర్ కూలిపోవడానికి కారణమని ప్రజలు అంటున్నారు. ప్రయాణికులు ఎవరూ లేరు కాబట్టి సరిపోయిందని ఎవరైనా ఉంటే పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. బస్ షెల్టర్‌ను నిర్మించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని విశాఖ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే జీవీఎంసీ పరిధిలో బస్ షెల్టర్‌ను నిర్మించాలని జీవీఎంసీ నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఉంటే 20 ప్రాంతాలలో రూ.4 కోట్లతో ఈ మోడ్రన్ బస్ షెల్టర్‌ను నిర్మించాలని తీర్మానించింది. ఇందులో భాగంగా తొలుత జీవీఎంసీ కార్యాలయం ఎదుట కట్టిన బస్ షెల్టర్ కుంగిపోవడం విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed