భోగాపురం ఎయిర్‌పోర్టుకు మరో 500 ఎకరాలు.. మంత్రుల కమిటీ గ్రీన్ సిగ్నల్

by srinivas |
భోగాపురం ఎయిర్‌పోర్టుకు మరో 500 ఎకరాలు.. మంత్రుల కమిటీ  గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా భోగాపురం(Bhogapuram)లో ఇంటర్నేషనల్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టు(Airport)ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎయిర్ పోర్టుకు అదనంగా మరో 500 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ నిర్ణయించింది. 2203 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఎయిర్‌పోర్టుకు మరో 500 ఎకరాలు ఇవ్వాలని జీఎంఆర్ కంపెనీ(GMR Company) ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. దీంతో సాధ్యాసాధ్యాలపై పరిశీలనపై చేయాలని ఆర్థిక మంత్రి పయ్యావుల(Finance Minister Payyavula) సమక్షంలో ప్రభుత్వం మంత్రుల కమిటీ(Ministers Committee)ని ఏర్పాటు చేసింది. దీంతో ఏవియేషన్ రంగంలో హైటెక్ ఉత్పత్తి, అనుబంధ సేవలు, ఏవియేషన్ హబ్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై ఈ కమిటీ అధ్యయం చేసింది. ఎయిర్‌పోర్టుకు అదనపు భూమి కేటాయించడం వల్ల అభివృద్ధి జరగడంతో పాటు ఆదాయం వచ్చే అవకాశం ఉందనే అంశాలపై మంత్రుల కమిటీ పరిశీలన చేసింది. ఈ మేరకు ఎయిర్ పోర్టుకు అదనంగా మరో 500 ఎకరాలు కేటాయించేందుకు మంత్రుల కమిటీ ఆమోదం తెలిపింది.

కాగా భోగాపురంలో ఎయిర్ పోర్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. తొలి దశలో ఎయిర్ స్పేస్, ఎడ్యుకేషన్ జోన్, ఎయిర్ సిటీ, ఇండస్ట్రీయల్ జోన్, విడి భాగాల తయారీ పరిశ్రమలు, హెల్త్ కేర్ జోన్, ఆరోగ్య, అతిథ్యం రంగాల అభివృద్ధి పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రతి ఏడాది 6.8 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే విధంగా పనులు చేపడుతున్నారు. అయితే ఈ ఎయిర్‌పోర్టుకు పక్కనే సిటీ సైడ్ డెవలప్‌మెంట్ కోసం 500 ఎకరాల భూమి ఉందని ప్రభుత్వాన్ని జీఎంఆర్ సంస్థ కోరింది.

Next Story

Most Viewed