ఆర్టీసీ బస్సులో ‘తండేల్’ మూవీ ప్రదర్శన.. విచారణకు ఆదేశం

by srinivas |   ( Updated:2025-02-10 17:17:19.0  )
ఆర్టీసీ బస్సులో ‘తండేల్’ మూవీ ప్రదర్శన.. విచారణకు ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఆర్టీసీ బస్సులో ‘తండేల్’ మూవీ(Tandel movie)ని ప్రదర్శించారు. జర్నీలో ప్రయాణికులను ఎంటర్‌టైన్ చేసేందుకు బస్సుల్లో అప్పట్లో ఆర్టీసీ(Rtc) యాజమాన్యం టీవీలను ఏర్పాటు చేసింది. ప్రతిరోజు ఏదో ఒక సినిమాను పదర్శిస్తోంది. అయితే ఆదివారం రోజున ఓ ఆర్టీసీ బస్సులో ‘తండేల్’ మూవీని ప్రదర్శించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే చిత్ర యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీఎస్ ఆర్టీసీ పైరసీని ప్రోత్సహించడంపై మండిపడింది. బస్సులో తండేల్ మూవీని ప్రదర్శించడాన్ని తప్పు బట్టింది. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ(RTC Chairman Konakalla Narayana) సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.



Next Story

Most Viewed