- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విశాఖ తీరానికి ఇద్దరు యువకుల మృతదేహాలు
by Javid Pasha |

X
దిశ, ఉత్తరాంధ్ర: శివరాత్రి స్నానాలు చేసేందుకు విశాఖ సముద్ర తీరానికి వచ్చిన స్నేహితుల్లో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు కొట్టుకొచ్చాయి. అప్పు ఘర్ వద్ద సముద్రంలో గల్లంతైన ఇద్దరు యువకులు విగతజీవులుగా అదే ప్రాంతంలో కొట్టుకొచ్చారు. వీరిద్దరి మృతదేహాలను స్కూబా డ్రైవర్లు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. మృతి చెందిన ఇద్దరు అఖిల్, ప్రవీణ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
బాధిత కుటుంబాలను వైసీపీ వైజాగ్ ఈస్ట్ సమన్వయకర్త విజయనిర్మల, వైసీపీ పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ పరామర్శించి ఓదార్చారు. సమస్యను సీఎం జగన్ కు తెలియచేసి వారి కుటుంబంలో ఒక్కొక్కరికి కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులుగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Next Story