టీడీపీ కార్యకర్తలపై దాడిని ఖండిస్తున్నా: చంద్రబాబు నాయుడు

by Phanindra |   ( Updated:2023-04-01 09:52:17.0  )
టీడీపీ కార్యకర్తలపై దాడిని ఖండిస్తున్నా: చంద్రబాబు నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వాహనం, టీడీపీ కార్యకర్తలపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతీ రోజూ దాడులు సమాధానం కాలేవని చెప్పుకొచ్చారు. వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: వైసీపీ రౌడీ మూకలు పెట్రేగిపోతున్నారు: అచ్చెన్నాయుడు



Next Story

Most Viewed