- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Elections 2024: కేశినేని బ్రదర్స్ వివాదానికి తెరదించిన అధిష్టానం.. టికెట్ పై క్లారిటీ
దిశ వెబ్ డెస్క్: పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలో ఒక నిర్ణయం తీసుకుని.. గత కొంత కాలంగా కేశినేని బ్రదర్స్ మధ్య రగులుతున్న వివాదనానికి ఎట్టకేలకు తెరదించింది అధిష్టానం. బెజవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టికెట్ ఇవ్వడంలేదని స్పష్టం చేసింది. వివరాలలోకి వెళ్తే.. రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసేందుకు ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని ఆసక్తి కనబరుస్తన్న నేపథ్యంలో నానికి చిన్నికి మధ్య చిన్నచిన్న వివాదాలు చోటుచేసుకున్నాయి. దీనితో పాటుగా ఈ నెల 7 వ తేదీన తిరువూరులో నిర్వహించనున్న చంద్రబాబు సభకు సంబంధించిన బాధ్యతలు కూడా కేశినేని చిన్నికి అప్పగించడం ఇద్దరి మధ్య మనస్పర్ధలకు మరింత కారణం అయ్యింది.
ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వివాదానికి తెరదించాలని నిర్ణయించుకున్న అధిష్టానం పార్టీ టికెట్ ను కేశినేని చిన్నికి ఇచ్చినట్లు అధికారికంగా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేశినేని నాని తన ఫేస్బుక్ పేజ్ లో అఫిషియల్ గా పోస్ట్ చేసారు. ఆ పోస్ట్ ద్వారా తనకి ఈసారి పార్టీ టికెట్ దక్కలేదని తెలియచేసారు. అధినేత ఆజ్ఞను శిరసావహిత్సనని తెలిపారు. ఈ తిరువూరు ఘటన తరువాత అధిష్టానం టికెట్ పైన క్లారిటీ ఇవ్వడం గమనార్హం. ఈ నేపథ్యంలో తనకు టికెట్ రాకపోవడం పైన స్పందించిన నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తనను ఈ విషయంలో కలగచేసుకోవద్దని అధిష్టానం ఆదేశించినట్లు తెలిపారు. అధినేత ఆజ్ఞను తూచ తప్పకుండా పాటిస్తానని పేర్కొన్నారు. తనకు పార్టీ టికెట్ ఇచ్చిన ఇవ్వకున్నా తాను ఎల్లప్పుడూ పార్టీ పట్ల విధేయతతో ఉంటానని తెలిపారు.