అందుకే వారితో యుద్ధం చేయాల్సి వస్తోంది.. CM జగన్ కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-03-01 14:43:45.0  )
అందుకే వారితో యుద్ధం చేయాల్సి వస్తోంది.. CM జగన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్- డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. అనంతరం కృష్ణా జిల్లా పామర్రులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలన్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు గుర్తు చేశారు.

ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువస్తే కూడా విమర్శలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. విద్యార్థులకు ట్యాబ్స్ ఇస్తే వారు చెడిపోతున్నారని ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పెత్తందార్లుకు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. 57 నెలలుగా జగన్నాథ రథ చక్రం ముందుకు కదులుతోందన్నారు. విద్యా దీవెనతో 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి జరుగుతుందన్నారు. రూ.708 కోట్లు లబ్ధి దారుల్లో ఖాతాలో వేసే ప్రక్రియను సీఎం జగన్ ప్రారంభించారు.

Read More : వైఎస్ వివేకా మర్డర్‌.. CM జగన్‌పై సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed