పదో తరగతి విద్యార్థలకు అలర్ట్.. ఏప్రిల్ 3నుంచి టెన్త్ పరీక్షలు

by samatah |
పదో తరగతి విద్యార్థలకు అలర్ట్..  ఏప్రిల్ 3నుంచి టెన్త్ పరీక్షలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఒంటిపూట బడులపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 3 నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నడుస్తాయని వెల్లడించారు వేసవి కాలం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 3 నుంచి ఒంటి పూట బడులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలు సైతం మూడో తేదీ నుంచే ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విజయవాడలోని పటమట రైతు బజార్ దగ్గర సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పదో తరగతి పరీక్షలు, ఒంటిపూటబడులు, ఓపెన్ స్కూల్ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అలాగే ఏప్రిల్ 3 నుంచి పదో తగరతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. 18వ తేదీతో ముగుస్తాయని వెల్లడించారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి

పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 3449 పరీక్షా కేంద్రాలలో పదో తరగతి పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. 6.69 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు ప్రకటించారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్ష జరగనుందని వెల్లడించారు. ఆరు సబ్జెక్ట్‌లకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారని చెప్పుకొచ్చారు. పరీక్షల నిర్వహణకి 800 స్క్వాడ్‌లు ఏర్పాటు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇక ఈ పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్లుగా కేవలం ప్రభుత్వ టీచర్లు మాత్రమే పనిచేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

నో మెుబైల్ జోన్

పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద నో మొబైల్ జోన్‌గా ప్రకటించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సెల్ ఫోన్, స్మార్ట్ పరికరాలు అనుమతి లేదని..ఇన్విజలేటర్లు కూడా తీసుకురాకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పరీక్షలు జరిగే రోజున పరీక్షా కేంద్రాల పరిధిలోని ఆయా పాఠశాలలకి సెలవు ఉంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు

Next Story

Most Viewed