- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందరి చూపు.. కార్పొరేటర్ల వైపే!
దిశ, నెల్లూరు: ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం నెల్లూరు రాకతో రూరల్ రాజకీయం మరింత వేడెక్కింది. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పార్టీని వీడడంతో ఇంచార్జి స్థానంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి రూరల్ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఇప్పుడు రూరల్ పరిధి కార్పొరేటర్లలో సందిగ్ధత నెలకొంది. తమ నుంచి ఏమీ ఆశించకుండా కార్పొరేటర్ టికెట్ కేటాయిచారన్న సానుభూతితో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వైపు ఉండాల లేక పార్టీ నిర్ణయం ప్రకారం ఇంచార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డితో నడవాల అన్న ప్రశ్న వారిలో మొదలైంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది కార్పొరేటర్లు శ్రీధర్ రెడ్డి వైపే ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తుండడంతో వైసీపీ నేతలు అలర్ట్ అయ్యారు. ఎక్కువ మంది కార్పొరేటర్లు తమవైపే ఉన్నారని నిరూపించుకోవడాని నేతలు వారితో ప్రలోభాలకు దిగారు. శ్రీధర్ రెడ్డి వైపు వెళ్లకుండా ఉండేందుకు రాత్రికి రాత్రే కార్పొరేటర్లను లెక్కగట్టి మరీ భారీ మొత్తంలో డబ్బు పంపిణీ చేశారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. దీంట్లో ముఖ్య పాత్రధారులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తుంది.
నెల్లూరు రూరల్ పరిధిలో 26మంది కార్పొరేటర్లలో సగానికి పైగా శ్రీధర్ రెడ్డి వెంట ఉన్నారు. అయితే వైసీపీ ప్రలోభాలకు దిగడంతో శ్రీధర్ రెడ్డి మద్దతుదారుల సంఖ్య సగానికి సగం పడిపోయింది. కొందరు మాత్రం తమకేమీ వద్దని తాము శ్రీధర్ రెడ్డితోనే ఉంటామని చెప్పినట్లు సమాచారం.
బలవంతపు ప్రదర్శన
నయానో..భయానో వచ్చిన కార్పొరేటర్లతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి మీటింగ్ పెట్టారు. 18 మంది కార్పొరేటర్లు తమ వెంటే ఉన్నారని బలప్రదర్శన చేసి చూపారు. కొందరు బలవంతంగానే బలప్రదర్శనలో పాల్గొన్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసంతృప్తులు చివరి నిమిషంలోనైన ఆయన్ను వీడి కోటంరెడ్డి వైపు వెళ్లవచ్చన్న అభిప్రాయంలో కొందరు నేతలు ఉన్నారని తెలుస్తోంది. రూరల్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 26మంది అధికార పార్టీ కార్పొరేటర్లు ఉండగా 18 మంది మాత్రమే ఆయన వద్దకు వచ్చారు. మిగతా వారంతా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటే ఉన్నారు.
శ్రీధర్ రెడ్డితోనే మేయర్
ఫోన్ ట్యాపింగ్ విషయంలో వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన శ్రీధర్‌రెడ్డి ఆ పార్టీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఆయనతోపాటు వివిధ సామాజిక వర్గాల వారూ కోటంరెడ్డికి పెద్ద సంఘీభావం వ్యక్తం చేశారు. ఎక్కువ శాతం మంది కార్యకర్తలు కోటంరెడ్డి వెంటే ఉన్నారు. శ్రీధర్ రెడ్డి తిరుగుబాటుతో రూరల్ నియోజకవర్గం రాజకీయం పూర్తిగా తలకిందులైంది. నెల్లూరు సిటీ, రూరల్ పరిధిలో 54 మంది కార్పొరేటర్లు ఉన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ క్లీస్ స్వీప్ చేస్తూ 54 డివిజన్లను కైవసం చేసుకుంది. దీంతో మేయర్ పదవి ఎస్టీ-జనరల్ కేటగిరీకి రిజర్వ్ కావడంతో పొట్లూరి స్రవంతిని ఎంపిక చేశారు. శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు అనంతరం ఆమె కూడా వైసీపీని వదిలి శ్రీధర్ రెడ్డికి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తాను కోటంరెడ్డి వెంటే ఉంటానని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తన పదవి పోయినా పట్టించుకోనని, రాజకీయ భిక్ష పెట్టిన కోటంరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తన మద్దతు ఉంటుందని స్రవంతి ప్రకటించారు.
నేనున్నాను.. స్వేచ్ఛగా పని చేయండి..కార్పొరేటర్లతో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
ఎంపీ ఆదాల మంగళవారం కార్పొరేటర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కార్పొరేటర్లు స్వేచ్ఛగా పని చేయాలని, వారికి సాధ్యమైనంత వరకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్పొరేటర్లు ఏ సమస్య ఉన్నా తనకు ఫోన్ చేయవచ్చునని, వాటిని అక్కడికక్కడే పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాబోయే రెండు రోజుల్లో కార్పొరేటర్లతో మున్సిపల్ కార్యాలయంలోనే సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. ఆనం విజయ్ కుమార్ రెడ్డితో తనకు చాలా కాలంగా సత్సంబంధాలు ఉన్నాయని తెలిాపరు. రాబోయే 20 రోజుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి కార్పొరేటర్లను పరిచయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి : ఢిల్లీ లిక్కర్ స్కాం.. MLC Kavitha మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ అరెస్ట్