Viveka Murder Case: : దస్తగిరే హంతకుడు.. అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదోపవాదనలు

by srinivas |   ( Updated:2023-04-27 13:22:28.0  )
Viveka Murder Case: : దస్తగిరే హంతకుడు.. అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదోపవాదనలు
X

దిశ, వెబ్ డెస్క్: వివేకానందారెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. ఎంపీ అవినాశ్ తరపున లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. వివేకా కేసులో దస్తగిరినే హంతకుడని, స్వయంగా పాల్గొన్నారని వాదనలు వినిపించారు. అలాంటి దస్తగిరి స్టేట్మెంట్‌ను ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. అలాగే గూగుల్ టేకవుట్ ఎలా ఆధారమవుతుందన్నారు. దస్తగిరి ఫస్ట్ ఇచ్చిన వాగ్మూలంలో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పేర్లు లేవని, రెండో స్టేట్‌మెంట్‌లో ఎలా వచ్చాయన్నారు. అవినాశ్ రెడ్డి టార్గెట్‌గా సీబీఐ దర్యాప్తు జరుగుతోందని అవినాశ్ రెడ్డి తరపు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. అటు వైఎస్ సునీత తరపు లాయర్లు కూడా వాదనలు వినిపిస్తున్నారు.

Next Story

Most Viewed