- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
హైడ్రా కూల్చివేతలపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే వసంత

దిశ, వెబ్ డెస్క్: మాకు ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారని టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ ఉదయం నుంచి టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ( TDP MLA Vasantha Krishna Pradsad ) గురించే రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు సంబంధించిన కట్టడాలను హైడ్రా అధికారులు ( Hydra Officers) కూల్చివేశారు. అయితే ఈ తరుణంలోనే హైడ్రా కూల్చివేతలపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు. మాకు ఎలాంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారన్నారు.
తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ( Cm revanth reddy ) విదేశాల నుంచి రాగానే ఆయనను కలుస్తానని ప్రకటించారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పకుండా నాకు న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు ఉందని చెప్పారు. హైడ్రా ( Hydra) కరెక్ట్ అయితే కోర్టుకు సెలవు ఉన్న రోజే వచ్చి ఎందుకు కూల్చివేతలు జరుపుతోంది ? అంటూ ఆగ్రహించారు. నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా హైడ్రా ప్రవర్తించిందని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.